Ajith : డిఫరెంట్ రోల్‌లో అజిత్

Update: 2024-07-02 06:47 GMT

'విడాముయర్చి' (పట్టుదల) పేరుతో తమిళ్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar ) తాజా చిత్రం లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోంది. 'విడాముయర్చి' సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అజిత్ గెటప్ వైరల్ అవుతోంది.

'విడా ముయర్చి' సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆద్యంతం ఆకట్టుకునే వినోదాత్మక చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజిత్ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రం 'మంగా' (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ప్రేక్షకులను మెప్పించనున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా విడాముయర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ... అజిత్ సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు వారి సహకారం అందిస్తున్నారని లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ చెప్పారు. ఆగస్ట్ నెలలో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తామని.. రిలీజ్ గురించి అధికారికంగా తెలియజేస్తామన్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News