Akhandha 2 : బాలయ్య అఖండ 2పై కుట్ర..?

Update: 2025-12-06 04:56 GMT

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల మోత మోగేది. కానీ సడన్ గా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ప్రీమియర్స్ కు రెండు గంటల ముందు సినిమా ఆగిపోయింది. దీనికి కారణాలు అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థపై అఖండ 2 నిర్మించారు. వీరిద్దరితోపాటు అనిల్ సుంకర కలిసి గతంలో 14 రీల్స్ అనే నిర్మాణ సంస్థను నిర్వహించారు. దానిమీద ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నిర్మించారు. గతంలో వన్ నేనొక్కడినే, ఆగడు లాంటి సినిమాలు నిర్మించి భారీగా నష్టపోయారు. ఆ సినిమాలకు ఫైనాన్స్ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టుకు వెళ్లి అఖండ 2 సినిమాపై స్టే వచ్చేలా చేసింది. తమకు కట్టాల్సిన బాకీ మొత్తం వడ్డీతో కలిపి 52 కోట్లు అయ్యాయని వాటిని చెల్లించేదాకా సినిమాను ఆపాలంటూ కోర్టుకు వెళ్ళగా ఈ విధంగా తీర్పు వచ్చింది.

గతంలో ఫైనాన్స్ ఇచ్చినప్పుడు అనిల్ సుంకర కూడా అందులో ఉన్నారు. కానీ వాళ్లు విడిపోయి అనిల్ సుందర ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను పెట్టుకున్నారు. రామ్, గోపి కలిసి 14 రీల్స్ ప్లస్ అనే సంస్థ మీద సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే ఇలాంటి ఫైనాన్స్ సమస్యలు సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. గతంలో ఎన్నో సినిమాలకు ఇలాంటి సమస్యలు వచ్చినా చివరకు వాటిని క్లియర్ చేసుకొని సినిమాలను అనుకున్న టైం లో రిలీజ్ చేశారు. చిన్న సినిమాలకు ఇలా ఫైనాన్సు ఇబ్బందుల వల్ల రిలీజ్ వాయిదా పడితే ఏదో అనుకోవచ్చు. కానీ బాలకృష్ణ లాంటి అగ్ర నటుడు సినిమా ఆగిపోవడం ఏంటి. పైగా అఖండ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు పెద్ద సినిమాలు పోటీకి కూడా లేవు. కానీ ఫైనాన్స్ సమస్యలను క్లియర్ చేసుకోవడంలో నిర్మాతలు ఫెయిలయ్యారు. వాళ్ల తప్పిదం వల్లే ఈ రిలీజ్ వాయిదా పడింది. కోర్టులో పిటిషన్ వేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ప్రజెంట్ లండన్ లో ఉన్నాడు. అతనితో మాట్లాడుదామని ట్రై చేసినా ఫోన్ లో అందుబాటులోకి రావట్లేదు. డైరెక్ట్ గా లండన్ వెళ్దామంటే ఫ్లైట్స్ ఆగిపోతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోస్ సంస్థకు పూర్తి బకాయిలు చెల్లిస్తే గాని బాలయ్య సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. చాలామంది ఈ సినిమాపై ఏదో కుట్ర చేశారని అనుకుంటున్నారు కానీ అందులో నిజం లేదు. కేవలం నిర్మాతల తప్పిదం వల్లే సినిమా ఆగిపోయింది. ఈ టైంలో వేరే హీరోల ఫ్యాన్స్ సెటైర్లు వేయడం కరెక్ట్ కాదు. నిర్మాతలు త్వరగా ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బెటర్.


Full View

Tags:    

Similar News