Akhil Akkineni Wedding : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్

Update: 2025-01-21 11:00 GMT

హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్-జైనబ్ రవ్జీల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొన్ని నెలల కింద వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్‌గా కనెక్ట్‌ అయింది.

అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

Tags:    

Similar News