బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అక్షయ్ నటించి లేటెస్ట్ మూవీ ‘సర్ఫీరా’ శుక్రవారం రిలీజైంది. తమిళ్ లో సూర్య నటించిన ‘సురారై పొట్రు(తెలుగులో ‘ఆకాశమే హద్దురా’) సినిమాకు బాలీవుడ్ రీమేక్ గా ‘సర్ఫీరా’ తెరకెక్కింది. అక్షయ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్లలో ఉండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన టెస్టులు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. అక్షయ్ కుమార్ గతంలోనూ రెండుసార్లు కరోనా బారినపడ్డారు. 2021, 2022లో ఆయనకు కరోనా వచ్చింది. కొవిడ్ పై పోరాడి కోలుకున్నప్పటికీ ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయని అక్షయ్ గతంలో వెల్లడించారు