అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరుకాని అక్షయ్.. కారణం
అక్షయ్ కుమార్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు.;
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈరోజు జూలై జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి అక్షయ్ కుమార్ హాజరు కానట్లు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ తన తాజా చిత్ర సర్ఫిరా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతని ప్రమోషన్ బృందంలోని కొంతమంది సిబ్బంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో తాను కూడా పరీక్ష చేయించుకున్నాడు. దాంతో అతడికీ పాజిటివ్ అని తేలింది.
''శుక్రవారం ఉదయం నటుడికి పాజిటివ్ వచ్చింది ప్రమోషన్‌ల చివరి దశ, అలాగే అనంత్ అంబానీ వివాహానికి వ్యక్తిగతంగా అతనిని ఆహ్వానించడానికి వెళ్ళాడు. అక్షయ్ బాధ్యతాయుతమైన వ్యక్తి, అతను వెంటనే తనను తాను ఐసోలేట్ చేసుకున్నాడు అని సమాచారం.
ఇదిలా ఉండగా, 2020 జాతీయ అవార్డు గెలుచుకున్న తమిళ చిత్రం 'సూరరై పొట్రు' హిందీ రీమేక్ అయిన 'సర్ఫిరా' ఈరోజు జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పరేష్ రావల్, రాధిక మదన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఒరిజినల్‌లో ప్రధాన పాత్ర పోషించిన తమిళ సూపర్‌స్టార్ సూర్య అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ కోసం మూడు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నారు. కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, రెమా మరియు జాన్ సెనా వంటి పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ముంబైకి చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూకే మాజీ పీఎం టోనీ బ్లెయిర్, భార్య చెరీ బ్లెయిర్, యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, శాంసంగ్ సీఈవో హాన్ జోంగ్ హీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జే వై లీ కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారు.