Alia Bhatt : కేన్స్ ఫెస్టివల్ కు అలియా భట్

Update: 2025-05-24 05:45 GMT

బాలీవుడ్ నటి అలియాభట్ ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టి వల్లో పాల్గొనేందుకు బయలుదేరింది. ఫెస్టివల్లో పాల్గొంటుందా? లేదా? అనే అనుమానాలకు తెరదీస్తూ సడెన్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించింది. అంతే కాదు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నూ రాసుకొచ్చింది. లేత గోధుమరంగు కోటు, వైట్ స్నీకర్స్, బ్లాక్ హ్యాండ్బ్యాగ్ , డార్క్ సన్ గ్లాసెస్ తో ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించి అదరగొట్టింది. దీంతో ఆమె అభిమా నులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎదురుచూస్తున్న రాణి ఇక్కడ ఉంది అంటూ ఓ అభిమాని రాసుకొ చ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆలియాభట్ చివరిసారిగా వాసన్బాల తెరకెక్కించిన జిగ్రాలో ఆకాంక్ష రంజన్ కపూర్, వేదంగ్ రైనాతో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ వార్ సినిమాలో విక్కీ కౌశల్, రణబీర్ కపూర్ తో కలిసి నటి స్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 20న విడుదల కానుంది.

Tags:    

Similar News