Allu Aravind: గీతా ఆర్ట్స్‌లో 'గీత' ఎవరు.. పేరు వెనుక కథ చెప్పిన 'అరవింద్'..
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అల్లు అరవింద్ నాయకత్వంలో మెగా మూవీస్ అన్నీ దాదాపు ఆ నిర్మాణ సంస్థలోనే విడుదలవుతుంటాయి.;
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అల్లు అరవింద్ నాయకత్వంలో మెగా మూవీస్ అన్నీ దాదాపు ఆ నిర్మాణ సంస్థలోనే విడుదలవుతుంటాయి. మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా గీతా ఆర్ట్స్‌కు చిత్ర పరిశ్రమలో పేరుంది. అయితే ఈపేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అన్న విషయాలను అల్లు అరవింద్ ఈ మధ్య ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
గీతా ఆర్ట్స్ అని తమ చిత్ర నిర్మాణ సంస్థకు పేరు పెట్టింది తండ్రి అల్లు రామలింగయ్య అని చెప్పారు. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు ఆయన. ప్రయత్నం మాత్రం మనది.. కానీ ఫలితం మాత్రం మనచేతిలో ఉండదు అనేది గీత చెబుతుంది. అదే చిత్ర నిర్మాతకు కూడా వర్తిస్తుంది. ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. పెట్టుబడి పెడతారు.
కానీ ఫలితం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నచ్చితే హిట్ చేస్తారు. లేదంటే ఫట్.. పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఒక్కోసారి. అదృష్టం బావుంటే దానికి డబుల్ కూడా వస్తుంది. అందుకే ఆయన ఆ పేరు పెట్టారు అని అరవింద్ వివరించారు. తాను చిరంజీవితో తీసిన చిత్రాలు దాదాపు హిట్టయ్యాయని తెలిపారు.
ఇక రాంచరణ్‌తో తీసిన మగధీర తనదగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెడితే దానికి మూడింతలు లాభం వచ్చిందని తెలిపారు. అందుకే గీతా ఆర్ట్స్ పేరు మార్చాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. ఇక చదువుకునే రోజుల్లో తనకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదట. స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారని అరవింద్ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.