పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదు గా..ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ను ఏకంగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పై కవర్ పేజీకి ఎక్కించేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన "పుష్ప 2” సినిమా బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం నెటిక్స్ కూడా భారీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ “ద హాలీవుడ్ రిపోర్టర్" ఇండియా సంచిక కవర్ పేజీలో అల్లు అర్జున్ ఫోటో ముద్రితమైంది. ఈ మేగజీన్ భారతదేశంలో “ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” పేరుతో విడుదలైంది. ఈ సంచికలోని మొదటి కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది. దీనికి “అల్లు అర్జున్ ది రూల్” అంటూ ప్రత్యేకంగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ మేగజీన్ టీమ్ అల్లు అర్జున్ పై ప్రత్యేకమైన ఫోటో షూట్ కూడా నిర్వహించింది. దీని "బిహైండ్స్ సీన్స్" వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇండియన్ బాక్సాఫీసులో పెద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం భావిస్తున్నాను. బలం, ఆత్మ విశ్వాసం మనసులో ఉండేవి. ఎవరూ వాటిని తొలగించలేరు అని తెలిపారు.