మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish) లేటెస్ట్ చిత్రం శాన్ ఆంటోన్ (San Anton) దర్శకత్వం వహించిన బడ్డీ (Buddy). ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావడానికి శిరీష్ ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదట జులై 26 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ఆగస్టు 2 కి వాయిదా వేశారు.
ఈ కొత్త విడుదల తేదీ మరో నాలుగు తెలుగు చిత్రాలతో పోటీ పడే పరిస్థితుల్ని కల్పించింది. రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి, ఆపరేషన్ రావణ్, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు చిత్రాలు బడ్డీతో పోటీ పడబోతున్నాయి. ఈ పోటీ మధ్య బడ్డీ ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
ప్రఖ్యాత స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బడ్డీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.