కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, మలయాళ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో తెరకెక్కిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ హీరో శివకార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తాజాగా అమరన్ పలు రికార్డులను నెలకొల్పింది. దీపావళి కానుకగా వచ్చిన 'అమరన్' మూవీ తమిళ్ మూవీస్ 2024 లో హయ్యెస్ట్ బుకింగ్స్ సాధించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 4.5 మిలియన్ టికెట్స్ అమ్మకాలతో విజయ్ నటించిన 'ది గోట్' మూవీ టాప్ నిలిచింది. ఇప్పుడు 'అమరన్' ఆ రికార్డును అధిగమించింది. కేవలం మూవీ రిలీజైన 25 రోజుల్లోనే 4.52 మిలియన్స్ టికెట్స్ సేల్స్తో టాప్లో నిలిచింది.