కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeyan ) , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ( Sai Pallavi ) ప్రధాన పాత్రలు పోషించిన దేశభక్తి చిత్రం ‘అమరన్’ (Amaran) . ఈ సినిమా ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్. ముకుంద్ వరదరాజన్‌కు మరణానంతరం అశోక చక్రను ప్రదానం చేశారు. ఆయన పాత్రను శివకార్తికేయన్ పోషిస్తుండడం విశేషం.
గత కొన్ని రోజులుగా అభిమానులను ఊరిస్తున్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. దీపావళి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్స్ లోకి రాబోతున్నాడు. విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ శివకార్తికేయన్ అగ్రెసివ్ లుక్ తో ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periayaswamy) ఈ సినిమాకు దర్శకుడు.
లోకనాయకుడు కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘అమరన్’ చిత్రం బహు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా శివకార్తికేయన్ కు ఏ రేంజ్ లో సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.