Anand Devarakonda: "పండుగ చేసుకునేలా 'బేబీ'".. జూలై 14న రిలీజ్

నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో "బేబీ" రాబోతోంది;

Update: 2023-07-08 10:18 GMT


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. ఈ సినిమా సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. మూవీ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... 'ఎస్‌కేఎన్ జర్నీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ట్రైలర్‌ను చూపించాడు. విరాజ్‌, ఆనంద్‌లు హీరోలవ్వాలనే ఆలోచనలేనప్పటి నుంచి నాకు తెలుసు. విజయ్ లాగ ఏదో హీరో అవ్వాలని ఆనంద్ రాలేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి తన ప్యాషన్ కోసం వచ్చాడు. జూలై 14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది'ని అన్నారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో "బేబీ" రాబోతోంది. ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది.




 


డైరెక్టర్ సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. 'జూలై 14న బేబీ సినిమా రాబోతోంది. కచ్చితంగా ఓ మంచి సినిమాను తీశాను. ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఇంత బాగా రాస్తావా? అని మారుతి గారు.. ఇంత డెప్త్ ఉందా?.. అని వాసు గారు అన్నారు. ఇంత బాగా తీస్తావారా? అని అల్లు అరవింద్ గారు అన్నారు. ఇలా తీయడం కూడా వచ్చా? అని వైఫ్ అడిగింది. సినిమా తీయక ముందు నన్ను నమ్మింది మాత్రం నా ఫ్రెండ్ ఎస్‌కేఎన్. నాలోని టాలెంట్‌ని గమనించి.. చాన్స్ ఇచ్చాడు. ఇది నాకు లైఫ్‌ టైం ఆపర్చునిటీ. ఈ సినిమాతో ఆయన జర్నీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన వంశీ పైడిపల్లికి థాంక్స్. జూలై 14న అందరూ సినిమాను చూడండి' అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినిమా చూసిన తరువాత అందరికీ ఓ వారం పాటు వెంటాడుతూ ఉంటుంది. పాటలు, మాటలు అన్నీ హంట్ చేస్తుంటాయి. ఇంకో సాలిడ్ రైటర్, గ్రేట్ డైరెక్టర్ దొరికాడని సాయి రాజేష్‌ అన్నను చూసి గర్వపడాలి. నాలోని యాక్టింగ్ పొటెన్షియల్‌ను సాయి రాజేష్‌ గారు నమ్మారు. ఆయన డైలాగ్స్, రైటింగ్‌ను చూస్తేనే ఎమోషనల్ అయ్యాను. జూలై 14న అందరి హృదయాలను కదిలిస్తాం. బేబీ మీ అందరినీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఈవెంట్‌కు వచ్చిన వంశీ అన్నకి థాంక్స్' అని అన్నారు.


Tags:    

Similar News