రాశికి అనసూయ సారీ.. అయినా ఆగని వివాదం..

Update: 2026-01-06 09:00 GMT

హీరోయిన్ రాశిపై అప్పట్లో చేసిన కామెంట్లకు ఎట్టకేలకు అనసూయ సారీ చెప్పింది. అలాంటి పదాలు వాడటం తప్పు అని.. తాను అప్పుడే ఎంతో ఫైట్ చేశానని పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది. శివాజీ హీరోయిన్ బట్టలపై చేసిన కామెంట్లకు గాను అనసూయ ఎంతగా రెచ్చిపోయిందో మనకు తెలిసిందే కదా. ఓ పెద్ద వివాదాన్ని రాజేసింది. అయితే అనసూయ ఏమైనా మహిళలకు సపోర్ట్ చేస్తుందా.. మహిళల పట్ల ఫెమినిస్ట్ గా మాట్లాడుతున్న ఆమె.. అప్పట్లో హీరోయిన్ రాశి మీద ఎంత దారుణమైన కామెంట్లు చేసిందో చూడండి అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ఆ వీడియోలను వైరల్ చేశారు. అప్పట్లో అనసూయ జబర్దస్త్ యాంకర్ గా చేసింది. ఆ టైమ్ లో హైపర్ ఆది డబుల్ మీనింగ్ స్కిట్ లో రాశి ఫలాల గురించి విన్నావా అని అంటే.. రాశిగారీ ఫలాల గురించేనా నువ్వు మాట్లాడేది అని అనసూయ డైలాగ్ చెప్పడం చూశాం. అది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో చివరకు హీరోయిన్ రాశి స్పందించింది. ఇలాంటి డైలాగులతో నన్ను బాడీ షేమ్ చేశారని సీరియస్ అయింది.

తనను జడ్జిగా రమ్మంటేనే వెళ్లలేదని.. అలాంటి స్కిట్ లో తనను అలా కామెంట్ చేస్తే అక్కడున్న జడ్జిలు నవ్వారని సీరియస్ అయింది. దీనిపై స్పందించిన అనసూయ.. అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు సారీ చెప్పింది. ఆ డబుల్ మీనింగ్ డైలాల్ గురించి తాను అప్పుడే నిర్మాతలతో ఫైట్ చేశానని.. కానీ ఏం చేయలేక అలా డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని సెంటిమెంట్ కథ చెప్పింది. నిర్మాతలు సారీ చెప్పకపోయినా తన బాధ్యతగా సారీ చెబుతున్నట్టు వివరించింది. అయినా సరే అనసూయపై ట్రోల్స్ ఆగట్లేదు. శివాజీ సారీ చెప్పినా సరే ఆయన్ను ఎవరూ వదలకుండా తిట్టేశారు కదా.

మరి ఇప్పుడు అనసూయ ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చి ఇంత దారుణంగా హీరోయిన్ మీద ఎలా కామెంట్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడూ మహిళలకు సపోర్ట్ చేయని అనసూయ.. బట్టల విషయంలోనే మాట్లాడుతుందా అని అంటున్నారు. ఎంతో మంది మహిళలు స్పోర్ట్స్ లో విజయాలు సాధిస్తే వాటిపై ఎన్నడూ స్పందించలేదు. మొన్న అంధుల మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ గెలిస్తే కనీసం పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఆడవారి బట్టలపై మాత్రం ఎందుకింత అటెన్షన్ కోరుకుంటోందని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలా అనసూయ మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టు అయిపోయింది.

Tags:    

Similar News