Anasuya Bharadwaj: చిరు సినిమాలో అనసూయ.. తగ్గేదే లే అనిపించే పాత్రలో..
Anasuya Bharadwaj: అనసూయ ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో కలిసి నటించింది.;
Anasuya Bharadwaj: యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. ఒక కామెడీ షోను హోస్ట్ చేయగానే విపరీతంగా పాపులర్ అయిపోయింది. ఆ పాపులారిటీనే తనకు సినిమా ఛాన్సులు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు తన కెరీర్‌లో నటించినవన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే. అయితే మరోసారి అలాంటి గుర్తుండే పాత్ర చేయడానికి అనసూయ సిద్ధమవుతోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా రీమేక్ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం 'లూసీఫర్'ను తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో అనసూయ కూడా యాడ్ అయినట్టు సమాచారం.
అనసూయ ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో కలిసి నటించింది. అందులోనూ ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రంలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌నే మలుపు తిప్పింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే గాడ్ ఫాదర్‌లో అనసూయది ఓ జర్నలిస్ట్ పాత్ర అని టాక్ వినిపిస్తోంది.