గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా విడుదలైంది. సినిమాకు మంచి టాక్ వస్తోంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే పబ్లిక్ మాత్రం విశ్వక్ సేన్ నటనను పొగిడేస్తున్నారు. విశ్వక్‌కి నటుడిగా ఈ సినిమా మంచి పేరుని అయితే తీసుకొస్తుంది. కమర్షియల్‌గానూ ఈ చిత్రం వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.