వివాదాలకు కేంద్ర బిందువు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయనపై ఫిర్యాదు చేయగా..రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది ఇటీవల అయన తీసిన "దహనం" వెబ్ సిరీస్ దీనికి ప్రధాన కారణం...
మావోయిస్టుల కథ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే దహనం అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. అయితే తన అనుమతి లేకుండా ఈ సిరీస్ లో తన పేరు వాడారని..రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా పోలీసులను ఆశ్రయించారు. అంతే కాకుండా ఇందులోని కొన్ని సన్నివేశాలు తాను చెప్పినట్లుగా చిత్రీకరించామని వర్మ పేర్కొన్నారని ... ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె తెలిపారు. తన అనుమతి లేకుండా తన పేరును వాడటం పట్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఐపీఎస్ ఫిర్యాదుతో ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి మరి...