Puri Jagannadh : పూరీ ప్రాజెక్ట్ లోకి మరో క్రేజీ బ్యూటీ

Update: 2025-04-14 08:15 GMT

ఎవరెన్ని అనుకున్నా.. తన వెనక ఏం మాట్లాడుకున్నా.. పూరీ జగన్నాధ్ అవేం పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అతని పని అయిపోయింది అన్న ప్రతిసారీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. అయితే ఈ సారి కాంబినేషన్ తో కొట్టాడు. ఎవరూ ఊహించిన విధంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. మోస్ట్ వాంటెడ్ స్టార్ అయిన విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్నాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎవ్వరూ కాస్త కూడా ఊహించలేదు ఈ కాంబినేషన్ గురించి. పైగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ డిజాస్టర్స్ చూసిన దర్శకుడిని విజయ్ సేతుపతి నమ్మడం ఇంకా సర్ ప్రైజ్ చేసింది. కోలీవుడ్ లో చాలామంది విజయ్ సేతుపతి ఫ్యాన్స్ పూరీతో సినిమా చేయొద్దని కూడా సోషల్ మీడియా వేదికగా అనేక పోస్ట్ లు పెట్టారు.. పెడుతున్నారు. అలాంటి వారందరికీ షాక్ ఇస్తూ మరో కీలకమైన అప్డేట్ ఇచ్చాడు పూరీ జగన్నాధ్.

ఈ మూవీలో మరో మెయిన్ లీడ్ లో టబు నటించబోతోందని ప్రకటించాడు. అప్పుడు అందరి నోళ్లూ మూతపడ్డాయి. విజయ్ సేతుపతి, టబు.. ఈ రెండు పేర్లు చాలు.. ప్రాజెక్ట్ కు కావాల్సింనంత వెయిట్ వచ్చేసింది. అప్పటి నుంచి ఈ మూవీ గురించి కాస్త ఎక్కువ పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లోకి మరో క్రేజీ బ్యూటీని తీసుకుంటున్నాడు పూరీ.

ఎలాంటి పాత్ర చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే రాధికా ఆప్టే కూడా ఈ చిత్రంలో నటించబోతోంది. ఎంత బోల్డ్ రోల్ అయినా మొహమాటం లేకుండా చేస్తుంది రాధిక. అలాగే ఎంత వెయిట్ పాత్రైనా అలవోకగా ఆకట్టుకుంటుంది. ఓ రకంగా ఈ జనరేషన్ లో బెస్ట్ యాక్ట్రెస్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు రాధికా ఆప్టేది. కొన్నాళ్ల క్రితం బాలయ్యతో లెజెండ్ అనే మూవీలో నటించింది. అప్పటి నుంచి మరో తెలుగు సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు ఈ మూవీతో తిరిగి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఏదేమైనా పూరీ ఈ సారి అంత ఈజీగా వదలడం లేదు అనిపిస్తోంది. తనపై వచ్చిన అన్ని విమర్శలకూ ఓ బ్లాక్ బస్టర్ తో సమాధానం చెప్పడం గ్యారెంటీ అంటున్నారు. అదే నిజమైతే పూరీ చరిత్ర సృష్టించడం ఖాయం.

Tags:    

Similar News