Sai Pallavi : సాయిపల్లవికి మరో క్రేజ్ చాన్స్!

Update: 2025-09-15 09:12 GMT

కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఒక వార్త. శింబు హీరోగా వెట్రిమారన్ దర్శ కత్వంలో తెరకెక్కుతున్న 49వ చిత్రం గురించి ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ మొదట పూజా హెగ్దేను హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో నేచురల్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటించనుందట. సాయిపల్లవి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తమిళంలో నటించ బోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్, అలాగే రామాయణ 1, 2లో సీతగా నటిస్తు న్న ఈమె, మళ్లీ కోలీవుడికి రీఎంట్రీ ఇవ్వడం పెద్ద సర్పైజ్ మారింది. వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్కి, సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్కి మంచి కాంబి నేషన్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఒకవేళ నిజమైతే శింబు, సాయిపల్లవి కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. మొత్తానికి సాయి పల్లవికి మరో క్రేజీ ఛాన్స్ దక్కినట్టే..!

Tags:    

Similar News