Tollywood : మిరాయ్లో మరో దర్శకుడు

Update: 2024-10-26 17:00 GMT

హనుమాన్ తరువాత యంగ్ హీరో తేజ సజ్జ చేస్తున్న కొత్త సినిమా మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. మంచు మనోజ్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా హరి గౌరా సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే మిరాయ్ సినిమాలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కీ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే పలు సినిమాల్లో మంచి పాత్రలు చేసిన వెంకటేష్ మహా ఈ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. 

Tags:    

Similar News