సౌత్ కుర్రాళ్ల కలల రాణి అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టు, చూడచక్కని రూపంతో యువత మనసును కట్టిపడేసింది. ప్రేమమ్ మూవీతో సి నీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజురోజుకు మరింత పాపులర్ అయ్యింది. కాగా.. ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల రూపొందిస్తున్న చిత్రం 'పరదా’. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు . దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్ ను షేర్ చేస్తూ.. ఈ అమ్మడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు.