Anushka Shetty : ఇక కెరీర్ లో గ్యాప్ తీసుకోను.. అనుష్క శెట్టి

Update: 2025-05-24 06:15 GMT

నాగార్జున హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ మూవీతో సినీరంగంలో అడుగు పెట్టింది నటి అనుష్క శెట్టి. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. అయితే నిశ్శబ్దం మూవీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుంది స్వీటీ. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. చాలాకాలం తర్వాత అనుష్కను చూసిన ప్రేక్షకులు ఖుషీ అయ్యారు. చాలా గ్యాప్ తీసుకుంది కాబట్టి స్వీటీ ఫ్యాన్స్ అయితే ఆమెను చూసేందుకు రిపీటెడ్గా సినిమాకు వెళ్లారట. కానీ ఆ సినిమా తర్వాత కూడా అనుష్క మళ్లీ కథల ఎంపికలో లేట్ చేసింది. ఫైనల్గా క్రిష్ దర్శకత్వంలో ఘాటితో ఇదిలా ఉంటే తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమను దృష్టిలో పెట్టుకొని స్వీటీ ఒక క్రేజీ డిసిజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మీదట కెరీర్ లో గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకుందట. అంతే కాదు ఒకప్పటిలా కమర్షియల్ సినిమాల్లో కూడా నటించాలని అను కుంటుందట. మరి కెరీర్ పట్ల అనుష్క నిజంగానే సీరియస్ గా ఆలోచిస్తుందా లేక మళ్లీ గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది. రాబోతుంది .

Tags:    

Similar News