Bigg Boss Tamil Winner : అర్చన రవిచంద్రన్ గుడ్ న్యూస్

Update: 2025-09-01 12:01 GMT

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 విజేత అర్చన రవిచంద్రన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తన నిశ్చితార్థం అయిపోయిందంటూ ఇన్ స్టాలో ఫొటోలను పోస్ట్ చేసింది. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అర్చన రవిచంద్రన్.. నటుడు అరుణ్ ప్రశా త్తో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని శుభ వార్త చెప్పకనే చెప్పారు. బిగ్బాస్ 7వ సీజన్ లో పాల్గొని విజేతగా నిలవగా, అరుణ్ ప్రశాత్ గతేడాది జరిగిన 8వ సీజన్ లో కంటెస్టెంట్గా వచ్చాడు. విజేత కాలేకపోయాడు. గత సీజన్లోనే ప్రియుడు కోసం అర్చన కూడా కాసేపు అలా వచ్చి వెళ్లింది. ప్రస్తుతానికి తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం బయట పెట్టడంతో సహ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News