Deepika Padukone : దీపికా ప్లేస్ ను రీ ప్లేస్ చేయబోతున్నారా

Update: 2025-12-05 11:45 GMT

దీపికా పదుకోణ్.. ఈ మధ్య కాలంలో కాంట్రవర్శీలో పడిపోయింది. ఆ కారణంగా తన ఆఫర్స్ కూడా కోల్పోతోంది. ముఖ్యంగా కొన్ని వర్కింగ్ అవర్స్ గురించే తను మాట్లాడింది. ఇదే చాలామందికి కోపం తెప్పించింది. ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ నటించే స్పిరిట్ మూవీ విషయంలో మాట్లాడింది. కట్ చేస్తే తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడింది. అంతే కాక ప్రభాస్ నటించే కల్కి 2 చిత్రం నుంచి కూడా తొలగించింది. కల్కిలో తన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అయినా తన క్యారెక్టర్ సెకండ్ పార్ట్ నుంచి తప్పించడం కారణమేంటీ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటున్నారు.. దీపికా స్థాయిలో మరో హీరోయిన్ ను ఎవరు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది అంటున్నారు.

ప్రియాంక చోప్రాను దీపికా పదుకోణ్ ప్లేస్ లో తీసుకుంటున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రియాంక ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు నటిస్తోన్న వారణాసి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తనకు ఈ సినిమాలో హైలెట్ అయ్యే సీన్స్ ఉన్నాయి అనేది బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర హైలెట్ అవుతుందంటున్నారు. అలాంటి తనకు కల్కి 2 చిత్రంలో హీరోయిన్ గా నటించడ బోతోంది అనే వార్త వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈ వార్తలో నిజం లేదు. ఒకవేళ నిజం అయినా.. ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సో.. ఇప్పటికైతే దీపికా పదుకోణ్ స్థానంలో ప్రియాంక చోప్రా నటించబోతోంది అనేది మాత్రం ఒక వార్తగా మాత్రం తెలుస్తోంది. 

Tags:    

Similar News