Ashika Ranganath : లంగా ఓణిలో ఆషికా రంగనాథ్ క్యూట్ స్టిల్స్

Update: 2025-05-27 11:00 GMT

'అమిగోస్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆషికా రంగనాథ్. తన ఫస్ట్ సినిమాతోనే యూత్లో మంచి ఫేమక్కించుకుంది. తన అందం, అభినయంతో ఆకట్టు కుంటూ కుర్రకారు మనసును కొల్లగొట్టింది. దీంతో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. కింగ్ నాగార్జున జంటగా 'నా సామి రంగా' చిత్రంతో పాటు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మూవీ 'మిస్ యూ’తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ కన్నడ భామ మెగాస్టా ర్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంలో నటిస్తోంది. దీని తర్వాత ఆషికకు ఇంకా చాన్స్లు వస్తాయని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు మూవీల సంగతి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్తో యూత్ ను రెచ్చగొడుతుంది. లేటెస్టుగా ఆషికా తన ఇన్స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. గోల్డ్, ఆరెంజ్ కలర్ లంగా ఓణిలో క్యూట్ స్టిల్స్ ఇచ్చింది. మెడలో చోకర్, పాపిట బిళ్ల, గాజులు, రింగ్స్ పెట్టుకుని ట్రెడిషనల్ లుక్ లోమెరిసిపోతోంది. ఈ ఫొటోలకు 'జీవితం నీకు టాంజెరిన్లు ఇచ్చిన ప్పుడు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్సెనెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Tags:    

Similar News