నేనే అబ్బాయిని అయితే .. లైంగికదాడి ఘటనపై నటుడి ఉద్వేగభరిత కవిత

Update: 2024-08-15 10:00 GMT

కోల్కతాలోని ఆర్డీ కార్ మెడికలాకాలేజీ జూనియర్ డాక్టర్పై జరిగిన లైంగికదాడి ఘటనపై బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా ఓ వీడియో షేర్ చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ ఆయన స్వయంగా ఓ కవిత రాసి దాన్ని చదివి వినిపించా రు. ‘నేనే అబ్బాయిని అయితే.. గది తలుపు తాళం వేయకుండానే పడుకోవచ్చు. నేనే అబ్బాయిని అయితే స్వేచ్ఛగా పరిగెట్టొచ్చు. రాత్రంతా ఫ్రెండ్స్ తో కలిసి నిర్భయంగా తిరగొచ్చు. ఆడపిల్లలను చదివించాలని.. వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతోమంది చెబుతుంటారు. తీరా కష్టపడి చదివి డాక్టర్ అయినా కూడా.. ఆ కంటిరెప్పను కా పాడుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఈ రోజు నాపై బలాత్కారం జరిగింది. ఓ దుర్మార్గు డి క్రూరత్వాన్ని కళ్లారా చూశా. సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదుగా..! పురుష భద్రతా సిబ్బందిని పెట్టినా.. అతడు తన విధిని స్వచ్ఛంగా నిర్వర్తించేవాడా? అందుకే నేనే అబ్బాయిని అయితే బాగుండేది. ఒకవేళ నేనూ అబ్బాయిని అయి ఉంటే ఈ రోజు బతికి ఉండేదాన్నే..!' అంటూ ఆ మృతురాలి ఆవే దనను ఆయుష్మాన్ కళ్లకు కట్టారు. ప్రపంచమం తా మీలాగే ఆలోచించి ఉంటే.. ఈ రోజు ఇలాంటి దారుణాలను చూడాల్సివచ్చేది కాదు” అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News