భాగ్యశ్రీ బోర్సేకి అదృష్టం కలిసి రావడం లేదు. తన ఫస్ట్ సౌత్ మూవీగా మొదలైన కాంత మాత్రం రెండు సినిమాల తర్వాత విడుదలైంది. అంతకు ముందు తన మిస్టర్ బచ్చన్,కింగ్ డమ్ మూవీ విడుదలయ్యాయి. మిస్టర్ బచ్చన్ లో తన ఎక్స్ పోజింగ్ మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. బట్ సినిమా మాత్రం డిజాస్టర్ గా తేలింది. కింగ్ డమ్ తన పాత్రలో ఓ క్లారిటీ మిస్ అవడంతో అదీ పోయింది. దీంతో ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యలో సడెన్ గా ఎంటర్ అయింది కాంత. ఈ మూవీ అందరింటే ముందే ప్లాన్ లోకి వచ్చింది. ఫైనల్ గా భారీ అంచనాల మధ్య విడుదల అయింది మూవీ. బట్ ఇదీ పోయినట్టే తేలిపోయింది.
కాంత మూవీ విషయంలో చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం అదరగొడుతుంది అని భావించారు. ఆ విషయంలో నిజమే అవును. దుల్కర్ నటన మాత్రం అదిరిపోయింది. సినిమాగా మాత్రం ఆకట్టుకోవడం లేదు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. బట్ తన పాత్ర మధ్యలో తప్పించడం మాత్రం మైనస్ అయింది. ఆమె పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. కానీ కాంత సెకండ్ హాఫ్ మాత్రం పోయింది అనే టాక్ వచ్చింది.
రానా అయితే తమిళ్ లో సపర్ అనే టాక్ వచ్చింది.. తెలుగులో మాత్రం ఫ్లాప్ వచ్చింది అని చెప్పాడు. బట్ ఓవరాల్ గా మాత్రం సినిమాకు నటనకు మంచి పేరొచ్చింది కానీ అంచనాలకు తగ్గట్టు మాత్రం రావడం లేదు. ఫైనల్ గా భాగ్యశ్రీ బోర్సే హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడిపోయాయి అని చెప్పాలి. మరి ఆంధ్రాకింగ్ తాలూకా మాత్రంపైనా తనే అంచనాలు పెట్టుకుని ఉంది ఇది.