రెబల్ స్టార్ ప్రభాస్ వరుస మూవీస్ తో ప్యాన్ ఇండియాను నాన్ స్టాప్ గా షేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.కానీ మేకర్స్ వల్ల ఆ మూవీస్ అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ సమ్మర్ లో రావాల్సిన రాజా సాబ్ పోస్ట్ పోన్ కావడం ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసింది. దీంతో పాటు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ గురించే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినబోతున్నారు అనే న్యూస్ టాలీవుడ్ లో సర్కిల్స్ లో ఉంది.
మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా రాజా సాబ్. ప్రభాస్ ఇమేజ్ కు భిన్నంగా ఇదో హారర్ కామెడీ మూవీ. అయినా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఏవో ఎక్స్ ట్రీమ్ అంశాలుంటాయని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కు పెద్ద చోటు ఉంది. అందుకే ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయింది. అయితే కొత్త డేట్ వాళ్లు అనౌన్స్ చేయకపోయినా దసరా కు ముందు సెప్టెంబర్ 25న విడుదలవుతుందనే ఊహాగానాలు వినిపించాయి. బట్ ఈ డేట్ కు రావడం లేదు అని బలంగా వినిపిస్తోంది.
అభిమానుల ఎదురుచూపులను సుదీర్ఘం చేస్తూ రాజా సాబ్ ఈ యేడాది చివర్లో విడుదలవుతుందున్నారు. యస్.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు అనే ఉంది. మారుతికి ఇది మోస్ట్ ప్రిస్టీజియస్ సినిమా. అందుకే లేట్ అయినా బెస్ట్ అవుట్ పుట్ తో రావాలనే ఇంత గ్యాప్ తీసుకుంటున్నారట. అంటే యేడాదికి ఖచ్చితంగా ఒకటీ రెండు సినిమాలు విడుదల చేయాలనుకుంటున్న ప్రభాస్ ఆలోచనకు గండి పడినట్టే. యేడాది చివర్లో అంటే ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.