చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. చిన్న వయసులోనే తన నటనతో ఈ చిన్నది ఆకట్టుకుంది. ఇక ముసుదా సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే ఆ సినిమా బోల్తా కొట్టడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత బలగం సినిమాలో యాక్ట్ చేసింది. నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో కావ్యకు కూడా మంచి క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి.. నటనతో ప్రేక్షకులను మెప్పించింది. బలగం తర్వాత ఉస్తాద్ అనే సినిమాలో కావ్య నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ బ్యూటీకి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రోహిత్ అనే కొత్త దర్శకుడితో ముందుకెళ్తున్నాడు. ఈ సినిమాకు సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలోనే కావ్య హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది.