Balakrishna: వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆర్..: బాలకృష్ణ
Balakrishna: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారు;
Balakrishna: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారన్నారు ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ. అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి NTR అన్నారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు బాలకృష్ణ. తన దృష్టిలో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆరే అన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమని అశ్విన్ అట్లూరి రూపొందించిన పాటను బాలకృష్ణ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 26వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నగారు తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.