Bhaje Vaayu Vegam : భజే వాయువేగం.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రైలర్ రిలీజ్
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా 'భజే వాయు వేగం'. మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్. రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ డిఫరెంట్ కాన్సెప్టుతో ఆకట్టుకుంటోంది.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 31న 'భజే వాయు వేగం' సినిమా విడుదలకానుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. భజే వాయు వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుందని.. హిట్టవుతుందని మూవీమేకర్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.