Bigg Boss 5 Telugu: సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు.. అందుకే ఇంగ్లీష్ కిస్ పెట్టలేదు: సన్నీ
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, దానికి హౌస్‌మేట్స్ రియాక్షన్ రోజురోజుకీ ఎంటర్‌టైనింగ్‌గా మారుతున్నాయి.;
VJ Sunny (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, దానికి హౌస్‌మేట్స్ రియాక్షన్ రోజురోజుకీ మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారుతున్నాయి. నిన్న(శుక్రవారం) 'స్మైల్ చేయండి.. టాస్క్ చేయండి' అనే టాస్క్‌ను హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో హౌస్‌మేట్స్.. వారి జీవితాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకొని.. వారికి ఆనందాన్ని కలిగించే సక్సెస్ స్టోరీని ప్రేక్షకులతో పంచుకోమన్నాడు బిగ్ బాస్. అందులో వారి వారి అనుభవాలను మిగతవారితో పంచుకున్నారు హౌస్‌మేట్స్. ఈ టాస్క్ ముగిసిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్‌లోకి అడుగుపెట్టారు హౌస్‌మేట్స్.
హౌస్‌మేట్స్‌కు బెలూన్ పగలపెట్టి కెప్టెన్ అయ్యే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎవరికీ సూది లభిస్తుంది.. ఎవరు ఎవరి బెలూన్‌ను పగలగొట్టాలి అనే విషయాల్లో హౌస్‌మేట్స్ మధ్య వివాదాలు కూడా జరిగాయి. ఈసారి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకున్న కాజల్ కూడా రవి చేతిలో ఓడిపోయి రేస్ నుండి తప్పుకుంది. విశ్వ అప్పటికే రెండుసార్లు కెప్టెన్ అయ్యాడని హౌస్‌మేట్స్ అంతా తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పరుచుకున్నారు.
కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ రౌండ్ వచ్చేసరికి యానీ మాస్టర్‌కు ఒకరి బెలూన్ పగలగొట్టడానికి సూది దొరికింది. దాంతో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని సన్నకి ఇచ్చింది యానీ. తను ఇచ్చిన సూదితో రవి బెలూన్ పగలగొట్టి కెప్టెన్‌గా బాధ్యత తీసుకున్నాడు సన్నీ. యానీ వల్ల తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి తర్వాత డైనింగ్ ఏరియాలో యానీని ముద్దుపెట్టుకుని థాంక్స్ చెప్పాడు. అంతే కాక సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు.. అందుకే ఇంగ్లీష్ కిస్ పెట్టలేదని అన్నాడు. దీంతో బిగ్ బాస్ ఎపిసోడ్ సరదాగా ముగిసింది.