Bigg Boss Telugu OTT: ఓటీటీలో బిగ్‌బాస్.. వచ్చేది ఆ రోజే..
Bigg Boss Telugu OTT: కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఈ షో కొనసాగనుంది. కంటెస్టెంట్లు క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం.;
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై అలరించే బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్నంత క్రేజ్ మరే షోకి లేదంటే అతిశయోక్తి కాదు. మనింట్లో కంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి దాదాపు అందరిలో ఉంటుంది.. దాన్నే క్యాష్ చేసుకుంటున్నాడు బిగ్‌బాస్.. విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే ఇంట్లో చేసే సందడి ప్రేక్షకులకు విందు భోజనం లాంటిది.. వచ్చేది 100 రోజులే అయినా అది వచ్చినన్ని రోజులు దానిపై బోలెడన్ని వార్తలు.
ఎన్ని సీజన్లు వచ్చినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.. ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రానుందని నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఇక్కడ కూడా ఆయనే యాంకరింగ్ చేస్తున్నారు.
దీనికి సంబందించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ అవుతున్నాయి. వయసు 60 దాటినా నాగార్జునలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. కోవిద్ నిబందనలు పాటిస్తూ ఈ షో కొనసాగనుంది. కంటెస్టెంట్లు క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం.
ఈ నెల 27 నుంచి ఓటీటీలో ప్రసారం చేసేందుకు బిగ్‌బాస్ టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. కంటెస్టెంట్లపై క్లారిటీ లేకపోయినా అనేక పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
యాంకర్ వర్షిణి, యాంకర్‌శివ, 'ఢీ-10' విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, 'సాఫ్ట్‌వేర్ డెవలపర్స్'వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, గత సీజన్‌లలో పాల్గొన్నముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్‌రాజ్, అరియానా గ్లోరీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.