Dhruv Vikram : బైసన్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Update: 2025-11-17 09:48 GMT

బైసన్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే నెల రోజుల్లోనే ఓటిటిలో విడుదల కావడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం మారి సెల్వరాజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీని రూపొందించాడు. అతని చిత్రాల్లో సోషల్ కాజ్ ఎక్కువగా కారణం అనిపిస్తుంది. అయితే ఈ మూవీ విషయం కూడా అదే కనిపిస్తున్నా.. అందులోని మెయిన్ హీరో రూట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది.

కబడ్డీ ఆట నేర్చుకున్నాడు ఓ కుర్రాడు. అందుకోసం అతను అనేక సమస్యలను దాటుకుని అంతర్జాతీయ స్థాయి వరకు వెళతాడు. ఈ మధ్యలో ఇద్దరు పొలిటీషియన్స్ వల్ల అతని లక్ష్యం ఇబ్బందుల్లో పడటం కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని దాటుకుని అతను కప్ వరకు వెళ్లడం, అర్జున్ అవార్డ్ అందుకోవడం మాత్రం సినిమాలో కనిపిస్తోంది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని 65 కోట్లకు పైగా వసూలు సాధించిన చిత్రంగా నిలిచిందీ మూవీ.

ధృవ్ విక్రమ్ తో పాటుగా పశుపతి, లాల్, ఆమిర్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లెక్స్ లో విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీని నవంబర్ 21న ఓటిటిలో వదలబోతున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మళయాలతో పాటు హిందీలోను ఈ చిత్రం ఓటిటిలో విడుదల చేస్తున్నారు. 

 

Tags:    

Similar News