Blockbuster : రికార్డులు కొల్లగొడుతున్న మహావతార్ నరసింహ...200 కోట్లు దాటిన వసూళ్లు.

Update: 2025-08-12 13:15 GMT

శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ప్రధానమైన నరసింహ అవతారం కథ నేపథ్యంలో యానిమేటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార నరసింహ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా 200 కోట్ల క్లబ్ లో చేరిన ఈ యానిమేటెడ్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. యానిమేటెడ్ సినిమాలు అంటే కేవలం చిన్న పిల్లల కోసం అనే ట్యాగ్ లైన్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా. 200 కోట్ల వసూళ్లు సాధించడంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

క్లీము ప్రొడక్షన్ , హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా కు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 25 న విడుదల అయిన ఈ పౌరాణిక చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ.210 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ విషయాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ బాగుంటే జనాలు తప్పకుండా సినిమాను ఆదరిస్తారూ అనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

Tags:    

Similar News