Sandeep Reddy : స్టార్ హీరోయిన్ ను భయపెట్టిన సందీప్ రెడ్డి వంగా

Update: 2025-05-27 09:29 GMT

బాలీవుడ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా ఉంది. మామూలుగానే బాలీవుడ్ కు ఏళ్ల తరబడి సౌత్ అంటే చిన్న చూపు. దాన్ని దాటి ఇప్పుడు మన తర్వాతే బాలీవుడ్ అనేలా మారాయి పరిస్థితులు. వీటికి రాజమౌళి ఆద్యుడు అయితే.. తర్వాత వచ్చిన దర్శకులు ఆ ట్రెండ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళుతున్నారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన సందీప్ రెడ్డి విజయాలు వారిని మరింత కలవరపెట్టాయి. పైగా మనోడు డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి హిట్స్ కొట్టాడు కదా. అందుకే అతని కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ పై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారు. అయినా ఆ సినిమాల బ్లాక్ బస్టర్స్ ను ఆపలేకపోయారు. ఇక ఇప్పుడు దీపికా పదుకోణ్ ఇష్యూతో మరోసారి సందీప్ పై అనవసర విమర్శలు మొదలుపెట్టారు.

సందీప్.. తన నెక్ట్స్ మూవీ స్పిరిట్ హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నాడు. ప్రభాస్ లాంటి స్టార్ తో ఛాన్స్ అయినా తను కొన్ని అసంబద్ధమైన కండీషన్స్ పెట్టిందట. దీంతో ఆమెను వద్దనుకున్నాడు సందీప్. ఆ స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన తృప్తి దిమ్రిని తీసుకున్నట్టు అనౌన్స్ చేశాడు. అంతే బాలీవుడ్ మరింతగా రగిలిపోతోంది. దీపికా లాంటి టాప్ హీరోయిన్ స్థానంలో ఓ కనీసం మీడియం రేంజ్ కూడా లేని హీరోయిన్ ను తీసుకుంటాడా అని ఇన్ డైరెక్ట్ గా రచ్చ మొదలుపెట్టారు. దీనికి దీపికా తనకు సందీప్ చెప్పిన కథను కొందరికి లీక్ చేసింది. దాన్ని ఆమె పిఆర్ అందరికీ పంచుతున్నారు. అలా ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారబోతోంది.

అవన్నీ ఎలా ఉన్నా.. దీపిక స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకోవడం ద్వారా దాదాపు 20 కోట్లకు పైగా నిర్మాతలకు మిగిలించాడు సందీప్. యస్.. దీపికా రెమ్యూనరేషన్ 20 కోట్లు. ఫ్లైట్ ఖర్చులు, ఆమె స్టాఫ్ ఖర్చులు కలిపి ఈజీగా మరో 5 లాగుతుంది. అదే తృప్తి రెమ్యూనరేషన్ ఈ మూవీకి జస్ట్ 4 కోట్లు. తనకు అదనంగా ఒకటీ రెండు కోట్లు ఖర్చు పెట్టినా.. నిర్మాతకు దాదాపు 20 కోట్ల వరకూ కలిసొస్తుంది. ఇదే లాజిక్ తో ఇప్పుడు బాలీవుడ్ సోకాల్డ్ టాప్ హీరోయిన్స్ కూ అప్లై అయితే వారి కెరీర్ కే ఎసరు వస్తుంది. అసలే హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పటి వరకూ సోలోగా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని దీపికాకు అంత ఇవ్వడం నిజంగా అనవసరమే అని బాలీవుడ్ లోనే మరో వర్గం మీడియా కొత్త రాగం అందుకుంది. అది ఇతర స్టార్ హీరోయిన్లకూ పాకితే స్టార్డమ్ కాస్తా తుస్సుమంటుంది.

Tags:    

Similar News