Boney Kapoor : శిఖర్ తో జాన్వీ రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్
నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) తన కుమార్తె, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రూమర్ లవర్ శిఖర్ పహారియాతో తన బంధం గురించి మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, శిఖర్ తమ జీవితంలోకి రావడం 'బ్లెస్డ్' అని చెప్పాడు. బోనీ కూడా జాన్వీ, శిఖర్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేయడం ద్వారా వారి సంబంధాన్ని ధృవీకరించినట్లు తెలుస్తోంది. జూమ్‌తో మాట్లాడుతున్నప్పుడు, బోనీ కపూర్, "నేను అతన్ని (శిఖర్) ప్రేమిస్తున్నాను. వాస్తవానికి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు జాన్వి అతన్ని చూడలేదు. కానీ నేను అతనితో స్నేహంగా ఉండేవాణ్ని. అతను అందరితోనూ స్నేహంగా ఉంటాడు" అని చెప్పాడు.
ఇప్పటివరకు జాన్వీ.. శిఖర్‌తో తన సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఆమె బహిరంగంగా లంచ్, డిన్నర్ ఔటింగ్‌లకు వెళ్లడం కనిపించింది. ఈ జంట ఇటీవల కలిసి ఒక పార్టీకి కూడా హాజరయ్యారు. శిఖర్ ఆమె సోదరి ఖుషీ కపూర్ పుట్టినరోజు వేడుకలోనూ జాన్వీతో కలిసి వచ్చారు. గత నెలలో తన 27వ పుట్టినరోజు కోసం, జాన్వీ, శిఖర్, ఓర్హాన్ అవత్రమణి అనే అతని సన్నిహిత స్నేహితుడు ఓరీతో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఉన్న ముగ్గురికి సంబంధించిన అనేక చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఇకపోతే శిఖర్ పహారియా రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.
ఇదిలా ఉండగా బోనీ కపూర్ అజయ్ దేవగన్‌తో తన రాబోయే చిత్రం 'మైదాన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఫుట్‌బాల్ ద్వారా భారతదేశానికి గర్వకారణమైన సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనే అజ్ఞాత వీరుడి కథే ఈ సినిమా కథ. దీనికి అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.