Sonam Kapoor: బాలీవుడ్ నటి ఇంట్లో భారీ చోరీ..
Sonam Kapoor: విలువైన నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు శనివారం అధికారికంగా తెలిసింది.;
Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ నివాసంలో రూ.2.4 కోట్ల విలువైన నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు శనివారం అధికారికంగా తెలిసింది.
ఈ సంఘటనను ధృవీకరిస్తూ, డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ అమృత గుగులోత్ మాట్లాడుతూ, సోనమ్ కపూర్ మామగారైన హరీష్ అహుజా నివాసంలో చోరీకి సంబంధించి రెండు నెలల క్రితం ఫిబ్రవరి 23న ఫిర్యాదు అందింది.
ఫిబ్రవరి 11న దొంగతనం జరిగిందని ఫిర్యాదుదారు గుర్తించారని, అయితే, 12 రోజుల తర్వాత ఫిబ్రవరి 23న ఈ ఘటనను రిపోర్టు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు సెక్షన్ 381 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం సాక్ష్యాలను పరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోంది అని గుగులోత్ తెలిపారు.
కాగా, సోనమ్ ఆమె భర్త ఆనంద్ అహుజా తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని.. సోనమ్ గర్భం దాల్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.