వరుస డిజాస్టర్ తో ఉక్కిరి బిక్కిరవుతున్న పూజాహెగ్దే మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. వరుస ప్లాపుల కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా 'ఆచార్య', 'రాధే శ్యామ్' సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సా ఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ అక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోయే స్ట్రెట్ తెలుగు ఫిల్మ్ లో పూజా హెగ్దేను హీరోయిన్గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించ నున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి పూజా హెగ్దేతో టాక్స్ పూర్తయినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇక రజినీకాంత్ నటించిన 'కూలి' సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ మోనికాలో నటించింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ పాటలో ఆమె డ్యాన్స్, గ్లామరస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఇటాలియన్ నటి మోనికా బెల్లుచికి నివాళిగా తెరకెక్కింది. మొత్తంగా, పూజా హెగ్డే తన కెరీర్‌లో కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, 'మోనికా' వంటి స్పెషల్ సాంగ్‌లతో పాటు కొత్త ప్రాజెక్ట్‌లతో మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. రాబోయే సినిమాలు ఆమె కెరీర్‌కు ఎంతవరకు బూస్ట్ ఇస్తాయో చూడాలి.