Janhvi Kapoor : దేవర షూటింగ్ కోసం వేచి ఉండలేకపోతున్నా : జాన్వీ కపూర్

Update: 2024-03-27 12:01 GMT

శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). దఢక్ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ అవ్వబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మరో వైపు రామ్ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మరో సినిమాలోనూ ఈ అమ్మడు యాక్ట్ చేస్తోంది. రెండు టాలీవుడ్ సినిమాల్లోనూ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. కాగా ఇప్పటికే దేవర షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ.. మళ్లీ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ లో అడుగుపెట్టాలన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. దేవరలో మళ్లీ తంగ పాత్ర చిత్రీకరణ కోసం ఇక ఏమాత్రం వేచి ఉండలేక పోతున్నాను అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.

Tags:    

Similar News