Tollywood : బరాబర్ ప్రేమిస్తా.. చంద్రహాస్ కొత్త సినిమా

Update: 2024-12-20 06:15 GMT

రామ్ నగర్ బన్నీ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో చంద్రహాస్. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చంద్రహాస్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. అదే 'బరబరా ప్రేమిస్తా'. మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సంపత్ రుద్ర తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్డ్రాప్ లో రానున్న పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ్చారు ఈ సినిమాను. మరి రామ్ నగర్ బన్నీతో ప్లాప్ అందుకున్న హీరో చంద్రహాస్ కు "బరాబర్ ప్రేమిస్తా" సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News