Chhava : ఛావా’.. బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Update: 2025-02-15 17:02 GMT

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'ఛావా'. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈమూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తొలి రోజే హిట్ టాక్ అందుకుంది. విక్కీ యాక్టింగ్ తో పాటు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్ పై ప్రశంసలు కురిపి స్తున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రీ సేల బుకింగ్స్ లోనే 5 లక్షల టికెట్స్తో హవా చూపిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ ఫస్ట్ డే దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఇటీవల రిలీజైన అక్షయ్ కుమార్ తో స్కై ఫోర్స్ తొలిరోజు రూ.15.30 కోట్లు వసూల్చేసి ఇప్పటివరకు టాప్లో ఉండగా.. తాజాగా ఛావా ఈరికార్డు నెలకొల్పింది. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈస్థాయి ఓపె నింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి

Tags:    

Similar News