Chiranjeevi : నాగేశ్వరరావు, చిరంజీవి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలొచ్చాయో తెలుసా..?
అక్కినేని నాగేశ్వరావు బ్రతికి ఉండగానే తన పేరుపై జాతీయ అవార్డ్స్ ను నెలకొల్పారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2006 నుంచి ప్రారంభమైన ఈ పురస్కారాలను మొదటగా దేవానంద్ కు ఇచ్చారు. ఆ తర్వాత షబనా అజ్మీ,అంజలి జయసుధ, వైజయంతి మాల, లతా మంగేష్కర్, కే బాలచందర్, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, గుడిపూడి శ్రీహరి, ఎస్ ఎస్ రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలకు ఇప్పటి వరకూ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ పురస్కారాలను అందించారు. 2019తర్వాత కోవిడ్ కారణంగా ఈ అవార్డ్ అందించలేదు. మళ్లీ ఈ యేడాది ఈ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు.
ఈ అవార్డ్ అందుకుంటున్న ఫస్ట్ తెలుగు హీరో చిరంజీవి కావడం విశేషం. మరి టాలీవుడ్ కే చెందిన మెగాస్టార్ కెరీర్ ఆరంభంలోనే సీనియర్ హీరోలతో కలిసి నటించాడు. అయితే తను పెద్ద స్టార్ గా ఎదిగే వరకూ ఏఎన్నార్ తో నటించే అవకాశం రాకపోవడం గమనార్హం. అక్కినేని తరం హీరోలంతా చిరంజీవితో మల్టీస్టారర్స్ చేశారు. బట్ ఏఎన్నార్ వరకూ రావడానికి 1993 వరకూ పట్టింది. ఈ కాంబోలో బి గోపాల్ దర్శకత్వంలో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది. వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. విజయశాంతి హీరోయిన్ గా నటించింది. చిరు, విజయశాంతి కాంబోలో వచ్చిన చివరి సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. అందుకే మళ్లీ వీరి కలయికలో మరో సినిమా రాలేదేమో. మరో విశేషం ఏంటంటే.. ఇది అక్కినేని నాగేశ్వరరావే నటించిన శ్రీరంగ నీతులు అనే సినిమాకు రీమేక్.
మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందుకోబోతోన్న మెగాస్టార్ కు ఆయనతో కేవలం ఒకే సినిమా అనుబంధం ఉందన్నమాట. మరి పురస్కార ప్రదానం సందర్భంగా ఈ సినిమా టైమ్ లోని ఎక్స్ క్లూజివ్ మెమరీస్ ను మెగాస్టార్ షేర్ చేసుకుంటారు అని వేరే చెప్పక్కర్లేదేమో.