Chiranjeevi : ఆ సినిమాకి కోటి రూపాయల రెమ్యునరేషన్.. ఫస్ట్ హీరో చిరంజీవినే..!
Chiranjeevi : కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా జన్మించిన మెగాస్టార్ చిరంజీవి విజయగాథ దశాబ్దాలుగా విస్తరించి ఉంది.;
Chiranjeevi : కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా జన్మించిన మెగాస్టార్ చిరంజీవి విజయగాథ దశాబ్దాలుగా విస్తరించి ఉంది. ఇప్పటికి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ చిరు మాత్రం ఎంతో వినయంగా ఉంటూ కొత్తతరానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. 1978లో విడుదలైన పునాదిరాళ్లుతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు చిరు.. కానీ థియేటర్లలో రిలీజైన మొదటి సినిమా ప్రాణంఖరీదు కావడం విశేషం.
మనవూరి పాండవులు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకురాగా ఖైది చిత్రం స్టార్ హీరోని చేసింది. బాలీవుడ్ మెగాస్టార్ బిబ్‌బి అమితాబ్ బచ్చన్‌ని ఓ టైంలో చిరంజీవి క్రాస్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానామొగుడు చిత్రంకోసం మెగాస్టార్ ఏకంగా రూ 1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమా 1992లో రిలీజైంది. ఆ టైంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడు చిరంజీవినే కావడం విశేషం.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రాణించిన మెగాస్టార్ .. ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ ఈ చిత్రం 1999లో సెట్స్‌పైకి వెళ్లి ఆ తర్వాత ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి... భోళాశంకర్, గాడ్ ఫాదర్, దర్శకడు బాబీ మూవీలను సెట్స్ పైన ఉంచాడు.