పవన్ నటించిన హరిహర వీరమల్లు రేపు రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పవర్ స్టార్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమాను సీఎం చంద్రబాబు చూస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. సీఎం రోజూ తనను చూస్తున్నారన్నారు. ‘‘ఒకవేళ మూవీ చూసినా ఐదు నిమిషాలు చూస్తారేమో. చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలు కోరితే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ మూవీ టికెట్ల పెంపునకు రెండు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రీమియర్ షోకు రూ.600 వరకు టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదల విషయంలో ఇటీవల చిన్న గందరగోళం ఏర్పడింది. డిజిటల్ ప్రింట్ అందలేదని విదేశీ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సమస్య కూడా క్లియర్ అయినట్లుగా సదరు సంస్థ మళ్లీ పోస్ట్ చేసింది. ఓవర్సీస్‌లో అన్ని లొకేషన్లకు ప్రింట్‌లు వచ్చేశాయని.. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్ 1గంట 26 నిమిషాల 40 సెకన్లు అని, సెకండ్‌హాఫ్ 1గంట 18 నిమిషాల 25 సెకన్లు అని తెలిపింది. ఈ చిత్రం ప్రదర్శించనున్న థియేటర్ల లిస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరమల్లు విధ్వంసం చూసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది.