అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో యంగ్ బ్యూటీ నభా నటేష్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యిం ది. యాక్సిడెంట్ కారణంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయినట్లు చెప్పు కొచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో అలరిస్తోంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈముద్దుగుమ్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు మూవీలో నటిస్తుంది నభా. ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో కనిపిం చనుంది. అలాగే పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధం లోనూ నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉంటూ తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది నభా. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫొటోషూట్ కట్టిపడేస్తుంది. లంగావోణిలో అచ్చం యువరాణిలా ముస్తాబై మరింత అందంగా కనిపిస్తుంది. ఈ పిక్కు ‘కాంక్రీట్ జంగిల్లో రాధ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తు తం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.