భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. స్టార్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే 'కంట్రోల్ ' అనే మూవీని సైబర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంశంతో ఈమూవీని తెరకెక్కించాడు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మనల్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో సినిమాలో చూపించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీలో మోనికా షెర్గిల్, అనన్య పాండే, విహాన్ సమత్ అద్భుతంగా నటించారు. ఓటిటిలో ఈ మూవీకి మంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. ఏఐ మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది, కంట్రోల్లోకి ఎలా తీసుకుంది అనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. 'కంట్రోల్' మూవీ ఇండియన్ మూవీ హిస్టరీలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం వినూత్నంగా ఆలోచించేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని తీసే కథలతో భారతీయ మూవీ హాలీవుడ్ సినిమాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు.