Ponniyin Selvan: విడుదలకు ముందే వివాదం.. మణిరత్నం, విక్రమ్‌లపై కేసు నమోదు..
Ponniyin Selvan: అయిదు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న మణిరత్నం చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలను తీసుకువచ్చింది.;
Ponniyin Selvan: అయిదు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న మణిరత్నం చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలను తీసుకువచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని వివాదాలను మూటగట్టుకుంది. చోళుల చరిత్రను 'పొన్నియిన్ సెల్వన్'లో తప్పుగా చిత్రీకరించారని నటుడు విక్రమ్, దర్శకుడు మణిరత్నంపై న్యాయవాది సెల్వం కోర్టు నోటీసు జారీ చేశారు.
చోళులకు నామం (నుదుటన పెట్టుకున్న తిలకం) లేదు. కానీ 'పొన్నియిన్ సెల్వన్'లో ఆదిత్య కరికాలన్ పాత్ర పోషిస్తున్న విక్రమ్, టీజర్‌లో నుదుటిపై నామంతో కనిపించాడు. 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగంలో చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించారని అన్నారు. విడుదలకు ముందే తన కోసం ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' రెండు భాగాలుగా రూపొందించబడింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాపై అంచనాలను పెంచడానికి మేకర్స్ రెగ్యులర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
'పొన్నియిన్ సెల్వన్' ఐదు భాషల్లో విడుదలవుతుండగా, విక్రమ్ తన పాత్ర కోసం ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పాడు. మేకర్స్ ఇటీవల చోళుల చరిత్రను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ చిన్న వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.