యంగ్ టైగర్ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. కర్ణాటకలో భారీ సెట్ నిర్మించిన ప్రశాంత్ నీల్.. మెజార్టీ షూటింగ్ పార్ట్ను అక్కడే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. ఆ పాట కోసం నేషనల్ క్రష్ రష్మిక మందాన్నను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్లో ప్రచారం తెగ జరు గుతోంది. బ్యాక్ టు బ్యాక్ యానిమల్, పుష్ప 2, తో బాక్సాఫీస్ ఛావా సినిమాల వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం పలు సినిమా ల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయినా కూడా ప్రశాంత్ నీల్ వంటి స్టార్ దర్శకుడు అడిగితే ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్తో కలిసి ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీవల్లి నో చెప్పే అవకాశం లేదని కొందరు అం టున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం కారణంగా సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని ని ర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.