Dragon Movie : ఎన్టీఆర్ డ్రాగన్ లో క్రేజీ బ్యూటీ

Update: 2025-06-05 07:45 GMT

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీలను లైనప్ చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే డ్రాగన్లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఇందుకోసం క్రేజీ బ్యూటీ కేతిక శర్మ తారక్ తో కలిసి స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తోంది. మూవీ టీమ్ సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చే స్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. కాగా అందాల భామ కేతిక ఇటీవల నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. శ్రీవిష్ణు 'సింగిల్' మూవీలో హీరోయిన్ గా నటించింది.

Tags:    

Similar News