‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించే సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఈ బ్యూటీ SSMB29లో నటిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సినిమాలోనూ నటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా తెలుగు దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. టాలీవుడ్‌లో ప్రియాంక ఇప్పటిదాకా నటించింది ఒక్క రామ్ చరణ్ తో ‘జంజీర్’ తెలుగు వర్షన్ లో ‘తుఫాన్’ మూవీలో మాత్రమే. అల్లు అర్జున్ తో సినిమా అంటే అట్లీకి కఠిన సవాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ‘పుష్ప 2’ తర్వాత అభిమానుల అంచనాలు అమాతం పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా తీయాలి. అందులో భాగంగానే బలమైన క్యాస్టింగ్ ను రెడీ చేసుకుంటున్నాడు.